బుడమేరు కట్ట తెగినట్టు పుకార్లు నమ్మొద్దు: మంత్రి

72చూసినవారు
విజయవాడ నగరంలోని కండ్రిక, బోస్ నగర్, జర్నలిస్టు కాలనీల్లో మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ పర్యటించారు. విజయవాడ సిటీలో వరద నీరు దాదాపు తగ్గిపోయిందని, రేపటికల్లా మొత్తం 32 వార్డులు సాధారణ స్థితికి వస్తాయని మంత్రి తెలిపారు. వరద నీటితో ఇళ్లలో చాలా బురద ఉందని వీధుల్లో ఫైర్ ఇంజిన్ లు ఏర్పాటు చేసి క్లీనింగ్ చేయిస్తున్నామన్నారు. బుడమేరు కట్ట తెగినట్టు, పుకార్లు సృష్టించి, ప్రజలని గందరగోళానికి గురి చేస్తున్నారన్నారు. బుడమేరు కట్ట తెగినట్టు పుకార్లు నమ్మొద్దన్నారు.

సంబంధిత పోస్ట్