ఇబ్రహీంపట్నం పేరును బూడిదపట్నం చేశారని మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వచ్చిన తర్వాత కూడా అడ్డగోలుగా పందికొక్కుల్లా వైసీపీ నాయకులు బూడిద దోచుకోవడమే కాకుండా ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నారని, తాగే నీటిలో సైతం బూడిద పడడంతో అనారోగ్య బారినపడి శ్వాసకోశ సమస్యలు ఎదుర్కొంటున్నారని మాజీ మంత్రి, టిడిపి నేత దేవినేని ఉమామహేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం సచివాలయంలో ఎన్నికల ప్రధాన అధికారికి ఫిర్యాదు చేశారు.