సుజనా చౌదరి, కేశినేని చిన్ని గెలుపు ఖాయం: జలీల్ ఖాన్

50చూసినవారు
విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి సుజనా చౌదరి గెలుపు దాదాపు ఖాయమని టీడీపీ నేత మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ అన్నారు. ఆదివారం విజయవాడలో తన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. సుజనా చౌదరిని గెలిపించడానికి ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారని అన్నారు. రెండు సంవత్సరాలుగా సేవా కార్యక్రమాలతో ముందుకు వెళ్తున్న ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్ని గెలుపు కూడా ఖాయమేనని చెప్పారు.

సంబంధిత పోస్ట్