సీఎం జగన్‌కు అభివృద్ధి తెలియదని, విధ్వంసమే తెలుసని చంద్రబాబు విమర్శించారు. "జగన్‌కు ప్యాలెస్‌లు, ప్రజల
కు మాత్రం పూరిళ్లా? ఇదెక్కడి న్యాయం. అధికారంలోకి రాగానే పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయిస్తాం. డ్వాక్రా సంఘాలకు రూ.10 లక్షల వరకు వడ్డీలేని రుణాలు ఇస్తాం. తొలి సంతకం మెగా డీఎస్సీపై, రెండో సంతకం ల్యాండ్ గ్రాబింగ్ యాక్టు రద్దుపై చేస్తాం." అని నూజివీడు సభలో చంద్రబాబు చెప్పారు.