ప్రపంచ హృదయ దినోత్సవ సందర్భంగా నరసరావుపేటలో ఆదివారం కోడెలస్టేడియం నుంచి 5కే వాక్ ప్రారంభమైంది. అయితే ఇందులో ఒక ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఇందులో ఎమ్మెల్యే చదలవాడ, మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి ఇరువురు పాల్గొని వాక్ చేశారు. వారు మాట్లాడుతూ. 40 సంవత్సరాల వయసులో యువత హార్ట్ ఎటాక్ గురికావడం బాధాకరమని పేర్కొన్నారు. మానసిక ఒత్తిడి తట్టుకోవడానికి వాకింగ్ అనేది చాలా ముఖ్యమని తెలిపారు.