మానవత్వం చాటుకున్న గురజాల సీఐ బాలకృష్ణ

70చూసినవారు
మానవత్వం చాటుకున్న గురజాల సీఐ బాలకృష్ణ
గురజాల మండలం దైద గ్రామంలో సోమవారం సీఐ బాలకృష్ణ విధులు నిర్వహించుకుని వస్తుండగా పులిపాడు వద్ద ద్విచక్ర వాహనాలు ఎదురుగా ఢీకొట్టడంతో గరికపాడు గ్రామానికి చెందిన వ్యక్తికి తలకు బలమైన గాయం కావటం చూసి అటుగా వస్తున్న సీఐ మానవత్వం చాటుకున్నారు. తీవ్రంగా గాయపడిన వ్యక్తిని తన వాహనంలో ఎక్కించుకొని గురజాల చేరుకొని గంగవరం మలుపు రోడ్డు వద్ద 108 వాహనంలో ప్రథమ చికిత్స నిమిత్తం గురజాల వైద్యశాలకు తరలించారు.