పిడుగురాళ్లలోని జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో ఈనెల 29న జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తామని సివిల్ జడ్జి మురళీ గంగాధర్ రావు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. కక్షిదారులు రాజీ పడదగిన క్రిమినల్, సివిల్, కుటుంబ తగాదాలు, ప్రీ లిటిగేషన్, చెక్ బౌన్స్ కేసులను పరిష్కరించుకోవాలని సూచించారు. డబ్బు, సమయం వృథా కాకుండా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరారు.