26 క్రస్ట్ గేట్ల ద్వారా నీటి విడుదల

70చూసినవారు
నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ 26 క్రస్ట్ గేట్ల ద్వారా
బుధవారం అధికారులు నీటిని విడుదల చేశారు. 26 గేట్లను 5 అడుగుల మేర - ఎత్తి 2, 09, 248 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. కాగా నాగార్జున సాగర్ జలాశయం నీటిమట్టం 589. 50 అడుగులు ఉంది. ఇది 310. 55 టీఎంసీలకు సమానం. కుడి కాలువ ద్వారా 8067 క్యూసెక్కులు, ఎడమ కాలువ ద్వారా 2210 క్యూసెక్కులు విడుదల చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్