నరసరావుపేట మండలం నరసరావుపేట పట్టణంలో సీఐ హైమారావు ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం పోలీసులు విస్తృతంగా వాహనాలు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా నెంబర్ ప్లేట్, ట్రిపుల్ రైడింగ్, హెల్మెట్, ధ్రువపత్రాలు లేని వాహనాలను సీజ్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ వాహనాలకు సంబంధించిన ధ్రువపత్రాలు కలిగి ఉండాలని సూచించారు.