ఓటర్ స్లిప్పులను పంపిణీ చేయాలి: పల్నాడు కలెక్టర్

60చూసినవారు
ఓటర్ స్లిప్పులను పంపిణీ చేయాలి: పల్నాడు కలెక్టర్
ఓటర్ సమాచార స్లిప్పులను ఈనెల 7 లోపల ఓటర్లకు పంపిణీ చేయాలని జిల్లా ఎన్నికల అధికారి శివశంకర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్లో రిటర్నింగ్ అధికారులు, మున్సిపల్ కమిషనర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ. ఓటర్ స్లిప్పులను త్వరితగతిన అందించేలా చర్యలు చేపట్టాలన్నారు. ప్రణాళికా బద్ధంగా వ్యవహరించి స్లిప్పులను అందజేయాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్