వినుకొండ: ఆర్టీసీ సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే

62చూసినవారు
రాష్ట్రంలో గుంతలు లేని రోడ్లు, ప్రజలకు అంతరాయంలేని ఆర్టీసీ సేవలను అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్య మని ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు అన్నారు. వినుకొండ డిపోలో 3 నూతన ఆర్టీసీ బస్సులను ఆదివారం చీఫ్్వప్ జీవి, ఎంపీ లావు కృష్ణదేవరాయలతో కలిసి ప్రారంభించి మాట్లాడారు. గత ప్రభుత్వం రూ. 10. 5లక్షల కోట్ల అప్పులు చేసి డొక్కు బస్సులతో ప్రజల్ని తిప్పలు పెట్టారని, కూటమితోనే అభివృద్ధి సాధ్యమని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్