మెరకముడిదాం మండల కార్యాలయం లో, ఐ.సి.డి.యస్ పర్యవేక్షకులు టి.శ్రీదేవి, జె.లక్ష్మి, యమ్. నాగమణి ఆధ్వర్యంలో అంగన్‌వాడీ కార్యకర్తలు,మహిళా సంరక్షణ కార్యదర్శులతో బాల్యవివాహ నిరోధక చట్టం పై అవగాహన సదస్సు బుధవారము నిర్వహించారు.టి.శ్రీదేవి మాట్లాడుతూ, ప్రతి అంగన్‌వాడీ కార్యకర్త తమ పరిధిలో బాల్యవివాహ నిషేధ చట్టం అమలులో సక్రమంగా వ్యవహరించాలని, చట్టంలోని కమిటీలు మరియు విధించే శిక్షలు గురించి తెలియజేసారు.