చీపురుపల్లి మండలంలోని రామలింగాపురం87లో గల శ్రీ మానసా దేవి నాగశక్తి అమ్మవారికి శుక్రవారం ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారాంతపు పూజల్లో భాగంగా అమ్మవారికి పలు రకాల పుష్పాలతో అలంకరించి, ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి, భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఈ మేరకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని, తమ మొక్కుబడులు తీర్చుకున్నారు.