ఓ చిట్ ఫండ్ కంపెనీలో లోన్ తీసుకుని సకాలంలో చెల్లించని వ్యక్తిని పోలీసులు మంగళవారం రాత్రి అరెస్టు చేశారు. విజయనగరంలోని ఓ ట్రాన్స్ పోర్ట్ చిట్ ఫండ్ కంపెనీలో గజపతినగరానికి చెందిన కొల్లా వెంకట సాయిరామ్ గతంలో తమ ఆస్తి పత్రాలను తనఖా పెట్టి లోన్ తీసుకున్నాడు. ఆ నగదును సకాలంలో చెల్లించకపోవడంతో విజయనగరం సివిల్ కోర్టు ఆదేశాల మేరకు సాయిరాంను అరెస్టు చేసి రిమాండ్ విధించినట్లు ఎస్ఐ లక్ష్మణరావు తెలిపారు.