మెంటాడ మండలం జయతి గ్రామంలో ఆదివారం రాత్రి శివపార్వతుల ఊరేగింపు కార్యక్రమాన్ని ఘనంగా ముచ్చర్ల వారి కుటుంబం ముచ్చర్ల గౌరీ శంకర్రావు ఆధ్వర్యంలో నిర్వహించారు. అనంతరం గ్రామంలోని శివగిరి కొండపై ఉన్న ఆలయంలో పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం జరుగుతుందని గ్రామస్థులు తెలిపారు. ప్రతి సంవత్సరం శివరాత్రి ముందు జరిగే పార్వతి పరమేశ్వరుల కళ్యాణంలో గ్రామస్థులందరూ భక్తిశ్రద్ధలతో పాల్గొంటారని అన్నారు.