రైస్ మిల్ లో సామాగ్రిని ధ్వంసం చేసిన ఏనుగులు

75చూసినవారు
గరుగుబిల్లి మండలం నందివానివలసలో శనివారం తెల్లవారుజామున ఏనుగుల గుంపు హల్ చల్ చేసాయి. గ్రామంలోని రైస్ మిల్లులోకి ఏనుగుల గుంపు చొరబడటంతో గ్రామస్తులు భయాందోలన చెందారు. రైస్ మిల్ బయట ఉంచిన సామగ్రిని ధ్వంసం చేసాయి. గ్రామంలోకి చొరబడి ఇళ్లపై దాడికి దిగుతాయమోనని ఆందోళన చెందారు. ఏనుగులను గ్రామాలకు దూరంగా తరలించాలని ప్రజలు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్