జియ్యమ్మవలస మండలం బాసంగి వలస గ్రామ సమీపంలో ఏనుగుల గుంపు సంచరిస్తున్నట్లు అటవీశాఖ సిబ్బంది తెలిపారు. సమీప ప్రాంత ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా రైతులు రాత్రి సమయంలో పొలాలకు వెళ్లరాదన్నారు. ఏనుగులు కనిపిస్తే కవ్వింపు చర్యలకు పాల్పడరాదని చెప్పారు. మరోవైపు ఏనుగులు గుంపు పంటలను నాశనం చేస్తున్నాయని రైతులు వాపోతున్నారు.