కురుపాం టీడీపీ మహిళా ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి బుధవారం కబడ్డీ ఆడారు. సంక్రాంతి పండుగ సందర్భంగా అక్కడ స్థానిక నాయకులు నిర్వహించిన పోటీలకు ఆమెకు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అనంతరం మహిళలతో కలిసి కబడ్డీ ఆడారు. కూతకు వెళ్లి అందరిని కాసేపు అలరించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా, ప్రభుత్వం గతేడాది అసెంబ్లీ ఎన్నకల్లో గెలవడంతో ఆమెను శాసనసభ విప్ గా నియమించిన విషయం తెలిసిందే.