కురుపాం: రజకుల జీవితాలను నాశనం చేసే పెట్రోల్‌ బంక్‌ వద్దు

78చూసినవారు
రజకుల జీవితాలను నాశనం చేసే పెట్రోల్‌ బంక్‌ ఏర్పాటును తక్షణమే ఆపాలని సిపిఎం నాయకులు వి. ఇందిర, కొల్లి సాంబమూర్తి అన్నారు. గురువారం జిసిసి పెట్రోల్‌ బంకు ఏర్పాటు చేసే ప్రదేశం వద్ద సిపిఎం ఆధ్వర్యంలో రజకులతో కలిసి నిరసన చేపట్టారు. అనంతరం సర్వే డిటి హేమలతకు వినతిపత్రం అందజేశారు. ఎన్నో ఏళ్లుగా చెరువులో బట్టలు ఉతుక్కుంటూ కుటుంబాలు నెట్టుకు వస్తున్న సమయంలో జిసిసి పెట్రోల్‌ బంక్‌ ఏర్పాటు చేయడం అన్యాయమన్నారు.

సంబంధిత పోస్ట్