విజయవాడ వరద బాధితులకు సహాయార్థం కురుపాం నియోజకవర్గం తరపున ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి శుక్రవారం విజయవాడలో సీఎం చంద్రబాబుకు రూ. 15. 56లక్షల చెక్కును అందజేశారు. కూటమి నాయకులు సహకారంతో సేకరించిన విరాళాలను వరద బాధితులకు సహాయం చేయడం జరిగిందని ఆమె తెలిపారు. ఈ మేరకు ఎమ్మెల్యే జగదీశ్వరికి సీఎం చంద్రబాబు తన అభినందనలు తెలిపారు.