కొమరాడ మండల కేంద్రంలో ఉన్న వసతి గృహాలను అధికారుల బృందం మంగళవారం పరిశీలించింది. గిరిజన సంక్షేమ బాలుర గురుకుల ఆశ్రమ పాఠశాల, కేజీబీవీ పాఠశాలను ఈ బృందం పరిశీలన చేసి పాఠశాలల్లో ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అలాగే ఉపాధ్యాయులు వసతి గృహాలలో చేపట్టవలసిన చర్యలపై పలు సూచన చేశారు. ఈ బృందంలో ఎంపీడీవో మల్లికార్జునరావు, ఉప తహశీల్దార్ శివయ్య, ఎస్సై నీలకంఠం, ఎంఈవో నారాయణస్వామి, తదితరులు ఉన్నారు.