

కురుపాం: ధ్వంసమైన రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలి
కొమరాడ మండలం గుమడ రైల్వే స్టేషన్కు వెళ్లే రహదారి సమస్య, అండర్ గ్రౌండ్ లో నిల్వ ఉన్న నీటిని తొలగించాలని కోరుతూ ఫిబ్రవరి 1న గుమడలో ధర్నా చేపడుతున్నట్టు సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు కొల్లి సాంబమూర్తి శుక్రవారం తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ. గుమడ గ్రామానికి బీటీ రోడ్డు ఉండేదని మూడో రైల్వే లైన్ కోసం పెద్దపెద్ద వాహనాలు సామగ్రి తేవడంతో రహదారి ధ్వంసమైందని దానికి వెంటనే మరమ్మతులు చేయాలన్నారు.