డా. బి ఆర్ అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్రమంత్రి అమిత్ షా ను వెంటనే బర్తరఫ్ చేయాలని సీపీఎం జిల్లా కమిటీ నాయకులు సాంబమూర్తి డిమాండ్ చేశారు. ఆదివారం కొమరాడ మండల కేంద్రంలో ఆయన మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలు దురదృష్టకరమని తక్షణమే కేంద్ర ప్రభుత్వం స్పందించి బర్తరఫ్ చేయాలని సీపీఎం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నామన్నారు.