పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం కొత్తవలస గ్రామ సమీపంలో ఉన్న యాదవుల గొర్రెల మందపై ఏనుగులు బుధవారం రాత్రి దాడి చేశాయి. ఈ సందర్భంగా గురువారం బాధితులు మాట్లాడుతూ తమ నివాసం పై రాత్రి వేళలో ఏనుగుల గుంపుతో వచ్చి వంట సామాగ్రి మొత్తం ధ్వంసం చేసాయని వాపోయారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమ ప్రాణాలు కాపాడాలని కోరారు.