కురుపాం: జీడి రైతులకు హార్టికల్చర్ అధికారులు భరోసా కల్పించాలి

83చూసినవారు
జీడి రైతులకు హార్టికల్చర్ అధికారులు భరోసా కల్పించాలని సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు సాంబమూర్తి కోరారు. మంగళవారం కొమరాడ మండలంలో గల డంగభద్ర గ్రామంలో జీడి తోటలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పువ్వు దశలో ఉన్నప్పుడు పంట చీడ పురుగుపట్టే పంట నాశనం అవుతుందన్నారు. హార్టికల్చర్ అధికారులు స్పందించి జీడి రైతులకు సూచనలు అందించి పంట బాగా పండేలా సలహాలు ఇవ్వాలని కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్