బల్లగూడలో మలేరియా కేస్.. అప్రమత్తమైన అధికారులు

57చూసినవారు
బల్లగూడలో మలేరియా కేస్.. అప్రమత్తమైన అధికారులు
వీరఘట్టం మండలం బల్లగూడ గిరిజన గ్రామంలో ఆరిక అఖిల అనే బాలికకు మలేరియా పాజిటివ్ రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఎంపీడీవో ఎంవీబీ సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో గ్రామంలో ప్రత్యేక వైద్య శిబిరాన్ని నిర్వహించి ఇంటింటా వైద్య తనిఖీలు చేశారు. గ్రామంలో ఉన్న మంచినీటి బావిలో పంచాయతీ సిబ్బంది క్లోరినేషన్ చేశారు. అనంతరం మలేరియా వచ్చిన బాలిక యోగక్షేమాలను ఎంపీడీవో అడిగి తెలుసుకున్నారు.

సంబంధిత పోస్ట్