ప్రతి శుక్రవారం గృహ నిర్మాణ దినోత్సవంగా పాటించడం జరుగుతుందని మన్యం జిల్లా కలెక్టర్ ఏ శ్యామ్ ప్రసాద్ తెలిపారు. గృహ నిర్మాణం, వేసవి వేడిమి, ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పిజిఆర్ఎస్) తదితర అంశాలపై జిల్లా కలెక్టర్ జిల్లా, మండల స్థాయి అధికారులతో సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రతి శుక్రవారం గృహ నిర్మాణ కార్యక్రమాలు సామూహికంగా ప్రారంభించాలన్నారు.