పార్వతీపురం నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా విభాగం అధ్యక్షులుగా శిల్లా వెంకటరమణను పార్టీ అధిష్టానం గురువారం నియమించింది. ఈయన పార్వతీపురం మండలం సంఘం వలస గ్రామానికి చెందిన వైసిపి సీనియర్ నాయకులు శిల్లా వెంకటరమణకు మాజీ శాసనసభ్యులు అలజంగి జోగారావు ప్రత్యేక అభినందనలు తెలిపారు. వెంకటరమణ మాట్లాడుతూ 2029లో పార్టీ విజయానికి తన వంతు కృషి చేస్తానన్నారు.