బ్రెయిలీ లిపిని కనుగొనడం ద్వారా అంధుల జీవితాల్లో లూయిస్ బ్రెయిలీ వెలుగులు నింపారని జిల్లా కలెక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కొనియాడారు. జిల్లా విభిన్న ప్రతిభావంతులు వయో వృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో డిఆర్డిఏ సమావేశ మందిరంలో శనివారం బ్రెయిలీ జన్మదిన వేడుకలకు నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ అంధులు కూడా చదువుకొని ఉన్నత స్థానాలను సాధించేందుకు ఈ లిపి ఎంతగానో దోహదపడిందని పేర్కొన్నారు.