సాలూరులో అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు మంజూరు

82చూసినవారు
సాలూరులో అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు మంజూరు
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సాలూరులో అదనపు సివిల్ జడ్జి కోర్టు(జూనియర్ డివిజన్)ను మంజూరు చేసింది. గత 40 సంవత్సరాల నుంచి సాలూరులో కేసుల పెండెన్సీ ఎక్కువ ఉన్నప్పటికీ ఒకే కోర్టుతో నడుపుతున్నారు. దీంతో కేసులు పరిష్కారం కాక కేసులు పెరిగాయి. సాలూరు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు అదనపు కోర్టు మంజూరైందని మంగళవారం తెలిపారు. పలువురు న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్