బెల్లానికి బదులుగా ఎలాంటి ఖర్చులు లేకుండా బాగా మగ్గిన తాటిపళ్ళను వాడి ద్రవ జీవామృతాన్ని అతి తక్కువ ఖర్చుతో తయారు చేసుకోవచ్చని పాచిపెంట వ్యవసాయ అధికారి కే తిరుపతి రావు అన్నారు. పాచిపెంట మండలం కూనం బంధ వలస గ్రామంలో శుక్రవారం రైతు అధికార్ల కృష్ణ రెండు ఎకరాల వరి పొలానికి కావలసిన నాలుగు వందల లీటర్ల ద్రవ జీవామృతాన్ని తాటి పళ్ళు ఉపయోగించి తయారు చేశారు.