ఎల్ కోట: నీటి సంఘం పాలకవర్గానికి అభినందనలు తెలిపిన ఎమ్మెల్యే

75చూసినవారు
ఎల్ కోట: నీటి సంఘం పాలకవర్గానికి అభినందనలు తెలిపిన ఎమ్మెల్యే
ఎస్. కోట నియోజకవర్గంలో గల ఐదు మండలాల్లో శనివారం జరిగిన సాగునీటి సంఘం ఎన్నికల్లో గెలుపొందిన పాలకవర్గం ఆదివారం ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి ఎల్ కోట ఆమె నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మేరకు ఆమె నీటి సంఘం పాలకవర్గానికి తన అభినందనలు తెలిపారు. చెరువులు అభివృద్ధికి, రైతులు సంక్షేమానికి నీటి సంఘం ఎన్నికల్లో గెలుపొందిన పాలకవర్గం కృషి చేయాలని కోరారు. ప్రభుత్వం తరఫున సహాయ సహకారాలు ఉంటాయని తెలిపారు.

సంబంధిత పోస్ట్