ఈనెల 23, 24, 25 తేదీల్లో తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో ఎల్ కోట మండల వెటర్నరీ డాక్టర్ గాయత్రి మంగళవారం పాడి రైతులకు పలు సూచనలు చేశారు. ఈదురు గాలులకు కరెంటు వైర్లు తెగిపడే అవకాశం ఉన్నందున పశువులను కరెంటు స్తంభాలకు కట్టొద్దని తెలిపారు. లోతట్టు ప్రాంతాల్లో పశువులను కట్టవద్దని, 6 మాసాల పెయ్యిలకు చల్లగాలి తగలకుండా చూసుకోవాలన్నారు. తుఫాన్ వల్ల పశువులు చనిపోతే తక్షణమే పశుసంవర్ధక శాఖ సహాయకులకు తెలియజేయాలని తెలిపారు.