లక్కవరపుకోట టీడీపీ కార్యాలయంలో శనివారం ఆన్లైన్ లో రూ. 1, 00, 000లు చెల్లించి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి కోళ్ల బాలాజీ అప్పల రాం ప్రసాద్ శాశ్వత సభ్యత్వం పొందారు. స్వర్గీయ మాజీ మంత్రి కోళ్ల అప్పల నాయుడు కుమారుడిగా రాజకీయాల్లోకి రంగప్రవేశం చేసిన రాంప్రసాద్, 2020 నుంచి ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యవర్గంలో ఆర్గనైజింగ్ సెక్రటరీగా క్రియాశీలకంగా కొనసాగుతున్నారు.