గంజాయి ఉత్పతిని, రవాణాను, వినియోగాన్ని అరికట్టి గంజాయి రహిత జిల్లాగా విజయనగరంను నిలపాలని, అందుకు పోలీస్, ఇతర శాఖలు సమన్వయంతో పని చేయాలనీ జిల్లా కలెక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలిపారు. విద్యా సంస్థల్లో యాంటి డ్రగ్ కమిటీలను వేసి డ్రగ్స్ వినియోగం వలన జరిగే నష్టాల గురించి అవగాహన కలిగించాలన్నారు. బుధవారము కలెక్టరేట్ లో మత్తు పదార్ధాలు, మాదక ద్రవ్యాల నిరోధక జిల్లా స్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు.