AP: ఏలూరు జిల్లా పట్టిసీమలో నేడు మంత్రి నాదెండ్ల మనోహర్ పర్యటించి.. ధాన్యం కల్లాలు పరిశీలించారు. రైతులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. ధాన్యం కొనుగోలు సమస్యలుంటే అధికారులకు చెప్పాలని సూచించారు. ప్రతి రైతు నుంచి ధాన్యం కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. కొనుగోలు చేసిన 24 గంటల్లోనే చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.