ఢిల్లీ శివారులోని గుర్‌గ్రామ్‌లో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. సైబర్ సిటీలోని ఓ రెస్టారెంట్‌కు కొందరు యువకులు వచ్చి ఫుడ్ ఆర్డర్ చేశారు. అయితే రెస్టారెంట్ సిబ్బంది మాడిపోయిన రొట్టె ఇవ్వడంతో రెస్టారెంట్ నిర్వాహకులతో సదరు కస్టమర్లు ఘర్షణకు దిగారు. ఈ క్రమంలో రెస్టారెంట్ బయట ఉన్న కారును తగలబెట్టడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. చివరికి అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేశారు. ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.