ఏపీలో రేపు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటించనున్నారు. మంగళగిరిలోని ఎయిమ్స్ స్నాతకోత్సవం జరగనుండడంతో ఆ కార్యక్రమానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరుకానున్నారు. ఈ క్రమంలో ప్రత్యేక విమానంలో మంగళవారం ఉదయం 11.30 గంటలకు విజయవాడ చేరుకొని అక్కడి నుంచి మంగళగిరి ఎయిమ్స్‌కు వెళ్లనున్నారు. ఈ కార్యక్రమంలో 49 మంది విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేస్తారు.