దేశంలో ఆత్మహత్యలు చేసుకుంటున్న వారి సంఖ్య ఏటా పెరుగుతోంది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) డేటా ప్రకారం.. 2017 నుంచి 2022 వరకు ఆత్మహత్యల రేటు 9.9 % నుంచి 12.4 %కి పెరిగింది. 2022లో దేశవ్యాప్తంగా 1,70,924 ఆత్మహత్యలు నమోదయ్యాయి. చిన్న రాష్ట్రాల విషయానికొస్తే సిక్కింలో అత్యధిక సూసైడ్ ఘటనలు నమోదు కాగా ఆ తర్వాత స్థానంలో అండమాన్, నికోబార్ దీవులు ఉన్నాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగుల ఆత్మహత్యలు ఎక్కువగా తమిళనాడులో చోటు చేసుకున్నాయి.