ఊహించని ఈ విపత్తు నుంచి సాధ్యమైనంత తొందరగా ప్రజలను బయటకు తెచ్చేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని సీఎం చంద్రబాబు అన్నారు. బాధిత ప్రజలు ధైర్యంగా ఉండాలని సోమవారం ట్వీట్ చేశారు. విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో రెండో రోజు కూడా పర్యటించానని, బాధిత ప్రజలకు అందుతున్న సాయాన్ని స్వయంగా పర్యవేక్షించానన్నారు. సహాయక చర్యలు చేపడుతున్నామన్నారు.