నటి అభినయ గురించి పరిచయం అక్కర్లేదు. శంభో శివ శంభో సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. తర్వాత చాలా సినిమాల్లో నటించారు. అయితే ఇటీవల అభినయ నిశ్చితార్థం చేసుకుంది. దానికి సంబంధించిన ఫొటోలను షేర్ చేశారు. కాగా ప్రస్తుతం మెహందీ ఫంక్షన్‌లో తనకు కాబోయే భర్తతో ఉన్న ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఇద్దరు చూడ ముచ్చటగా ఉన్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.