విశాఖలో హృదయవిదారక ఘటన వెలుగు చూసింది. గురువారం 60వ వార్డు కోరమండల్ ఎదురుగా ఉన్న శ్మశాన వాటికలో పాతిపెట్టిన శవాలను పందులు పీక్కు తింటున్నాయి. గత కొన్ని రోజులుగా ఈ ఘటనలు జరుగుతున్నా, సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవడంలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యను తక్షణమే పరిష్కరించాలని జీవీఎంసీ అధికారులను విశాఖ ప్రజలు కోరుతున్నారు.