రిగ్గింగ్ చేశారు కాబట్టే పిన్నెల్లి EVMను ధ్వంసం చేశారు: వైసీపీ MLA

60చూసినవారు
రిగ్గింగ్ చేశారు కాబట్టే పిన్నెల్లి EVMను ధ్వంసం చేశారు: వైసీపీ MLA
TDP నేతలు రిగ్గింగ్ చేసి, తమ ఏజెంట్లపై దాడి చేయడం వల్లే పిన్నెల్లి ఈవీఎంను ధ్వంసం చేశారని గురజాల వైసీపీ ఎమ్మెల్యే కాసు మహేశ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. 'మాచర్ల నియోజకవర్గంలో 7 చోట్ల ఈవీఎంలు ధ్వంసం చేశారని అధికారులు చెబుతున్నారు. మరి పిన్నెల్లి వీడియో ఒక్కటే ఎందుకు బయటకు వచ్చింది? మిగతా వీడియోలూ రిలీజ్ చేయండి. దీనిపై హైకోర్టును ఆశ్రయిస్తాం. పిన్నెల్లి గెలుపును ఎవరూ ఆపలేరు' అని స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్