దర్శి: అదుపుతప్పిన ట్రాక్టర్.. వాగులోకి దూసుకు వెళ్లిన ఇంజన్

53చూసినవారు
ట్రాక్టర్ అదుపు తపటంతో ఇంజన్ వాగు అంచులోకి దూసుకు వెళ్ళింది. ఈ సంఘటన కురిచేడు మండలంలో శుక్రవారం చోటు చేసుకున్నది. పెద్దవరం నుండి కట్టెల లోడుతో కురిచేడువైపు వెళుతున్న ట్రాక్టర్ అగ్రహారం వద్ద ఉన్న నాగి చెట్టు కుంట వద్ద అదుపు తప్పింది. ట్రాక్టర్ ఇంజన్ ముందు చక్రాలు వాగు అంచులోకి దిగాయి. ఆ సమయంలో డ్రైవర్ అప్రమత్తమై రోడ్డుపైకి దూకడంతో ఆయన ప్రమాదం నుండి తప్పించుకున్నారు.

సంబంధిత పోస్ట్