గిద్దలూరు: అధికారులను అప్రమత్తం చేసిన జిల్లా కలెక్టర్

66చూసినవారు
ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గం లోని అర్ధవీడు, కంభం పరిసర ప్రాంతాలలో అల్పపీడనం కారణంగా రాబోవు 24 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని జిల్లా కలెక్టర్ తమిమ్ అన్సారియా మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఇప్పటికే స్థానిక అధికారులను అప్రమత్తం చేశామని ఆమె చెప్పారు. ప్రజలు కూడా సురక్షితమైన ప్రాంతాలలో ఉంటూ జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్