గిద్దలూరులో: గత ప్రభుత్వంపై ఎక్సైజ్ అధికారి విమర్శలు

68చూసినవారు
గత ప్రభుత్వం నాసిరకమైన మద్యాన్ని విక్రయించడం వల్ల ప్రజల ఆరోగ్యాలు దెబ్బతిన్నాయని మార్కాపురం డివిజన్ అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరిండెంట్ బాలయ్య వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు స్థానికంగా చర్చనీయాంశంగా మారాయి. శనివారం గిద్దలూరు ఎక్సైజ్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో బాలయ్య గత ప్రభుత్వం మద్యం పాలసీపై విమర్శించారు. ప్రస్తుత ప్రభుత్వం నాణ్యమైన మద్యం అందించేందుకు చర్యలు తీసుకుంటుందని ఆయన అన్నారు.

సంబంధిత పోస్ట్