వరలక్ష్మి వ్రతం సందర్భంగా ప్రకాశం జిల్లా త్రిపురాంతకం బాల త్రిపుర సుందరి దేవి అమ్మవారి ఆలయంలో శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ నలుమూలల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకున్నారు. మహిళ భక్తులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు, కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు పూర్తి చేశారు.