దోర్నాల: చెడ్డి గ్యాంగ్ కదలికలపై నిఘా
జిల్లాలో చెడ్డి గ్యాంగ్ కదలికలు ఉన్న నేపథ్యంలో కట్టుదిట్టంగా వ్యవహరిస్తున్నామని శుక్రవారం దోర్నాల ఎస్ఐ మహేష్ తెలిపారు. స్థానిక ప్రజలు ఇతర ప్రాంతాలకు వెళ్తుంటే మహిళా పోలీస్ కు లేదా పోలీస్ స్టేషన్ లో కానీ సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే బ్యాంక్ అధికారులకు నోటీసులు ఇచ్చామని ఏటీఎం మిషన్ల వద్ద ఒక గార్డును ఏర్పాటు చేసుకోవాలని సూచించినట్లు ఎస్సై మహేష్ చెప్పారు.