ఒంగోలు పై ఎందుకు ఈ నిర్లక్ష్యం?: ఎమ్మెల్యే
విశాఖలో చూపించామని చెప్తున్న హుందాతనం ఒంగోలు, ఏలూరులో ఎక్కడికి పోయిందని ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ప్రశ్నించారు. ఓడిపోయే విశాఖ ఎమ్మెల్సీ సీటులో రాజకీయ హుందాతనం పేరుతో ఎన్నికలలో పోటీ చేయకుండా ఎగ్గొట్టడం, ఒంగోలు, ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ మేయర్లను కొనటంలో మాత్రం హుందాతనం బదులు బొంకుతనం ప్రవేశపెట్టడం టిడిపి రాజకీయ విధానం అని ఎక్స్ లో చంద్రశేఖర్ గురువారం పోస్ట్ చేశారు.