జిల్లావ్యాప్తంగా 144 సెక్షన్ అమలు

63చూసినవారు
జిల్లావ్యాప్తంగా 144 సెక్షన్ అమలు
జిల్లా వ్యాప్తంగా జూన్ 3 నుండి 5వ తేదీ వరకు 144 సెక్షన్ అమలు చేస్తూ కలెక్టర్ దినేష్ కుమార్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. 4వ తేదీన ఒంగోలు సమీపంలోని రైజ్ ఇంజనీరింగ్ కళాశాలలో ఓట్ల లెక్కింపు ఉన్న నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు, పదిమంది ఒకచోటకు చేరకుండా ఉండేందుకు 144 సెక్షన్ అమలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. 3వ తేదీ ఉదయం 6 నుండి 5వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు 144 సెక్షన్ అమలులో ఉంటుందని తెలిపారు.

సంబంధిత పోస్ట్